Telangana Graduate MLC: రెండోరోజు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Graduate MLC: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రెండోరోజు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మూడో రౌండ్ లో ఎవరు ఆధిక్యంలో వస్తారన్నదానిపై ఆశక్తి నెలకొంది.
రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు వివరాలు:
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
* తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్)కు 34,575 ఓట్లు వచ్చాయి.
* రాకేష్ రెడ్డి (బీఆర్‌ఎస్)కు 27,573 ఓట్లు వచ్చాయి
* ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ)కి 12,841 ఓట్లు వచ్చాయి
* స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 11,018 ఓట్లు వచ్చాయి
కాగా.. తీన్మార్ మల్లన్న 7,002 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత తొలి రౌండ్ కౌంటింగ్ వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ మద్దతు తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు, బీఆర్‌ఎస్ బలపరిచిన రాకేష్‌రెడ్డికి 28,540 ఓట్లు, బీజేపీకి చెందిన ప్రేమేందర్‌రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ ముగిసే సమయానికి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో మొత్తం 96,097 ఓట్లు పోలవ్వగా, వాటిలో 88,369 చెల్లుబాటు కాగా, 7,728 చెల్లలేదు. తొలి రౌండ్ పూర్తయిన తర్వాత రెండో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నల్గొండలోని దుప్పలపల్లి గోదాములో కౌంటింగ్ కొనసాగుతోంది.
Read also: Pinnelli Ramakrishna Reddy: నేటితో ముగియనున్న పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు..
పట్టభద్రుల ఉప ఎన్నికలో మొత్తం 3 లక్షల 36 వేల ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తవుతుంది. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం అంత తేలిక కాదనే అభిప్రాయాన్ని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోందని ఆర్వో దాసరి హరిచందన తెలిపారు. ఈరోజు పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గత నెల 27న పోలింగ్ జరగ్గా.. తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
Left parties: కనుమరుగైపోతున్న కమ్యూనిస్టు పార్టీలు..
తాజావార్తలు
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!