Site icon NTV Telugu

Naini Rajender Reddy : సొంత పార్టీలో కోవర్టులు.. గొడ్డు చాకిరి చేస్తున్నా

Conflicts Between Telangana Congress Leaders.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆదిపత్య పోరు కొనసాగుతోంది. అగ్రనేతలే కాకుండా మధ్యతరగతి నేతల్లో కూడా ఆదిపత్య పోరు సాగుతోంది. తాజాగా హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగా హనుమకొండలో పాగా వేసేందుకు కొంతమంది కోవార్టులతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

పార్టీ కోసం గొడ్డు చాకిరి చేస్తున్నానని, జంగా రాఘవరెడ్డి లాంటి చిల్లర నాయకులను చూస్తుంటే అసహ్యం అనిపిస్తుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. జంగా నీచ రాజకీయాలపై ఇప్పటికే పదిసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశామని, ఎలాంటి చర్యలు లేవు, అధిష్టానం ఇప్పటికైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మా ఓపికను పరీక్షించవద్దని, 31వ తేదీ వరకు జంగా రాఘవరెడ్డి వ్యవహారంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోక పోతే.. సామూహిక నిర్ణయం తీసుకుంటామన్నారు.

https://ntvtelugu.com/etela-rajender-made-sensational-comments/
Exit mobile version