Site icon NTV Telugu

Nagoba Jatara: వైభవంగా నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన

Nagoba Jatara

Nagoba Jatara

Nagoba Jatara: మెస్రం కుటుంబీకుల కల నెరవేరింది. నాగోబా ఆలయాన్ని కొత్తగా సిద్ధం చేశారు. ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న నాగోబాకు మహా పూజలు చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం నిర్మించిన ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో మెస్రం కులస్తుల ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. గిరిజన వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అష్టదీప, ఘాట్ ప్రత్యేక పూజలతో పాటు నవగ్రహ పూజలు నిర్వహించారు. నాగోబా ఆలయ పునర్నిర్మాణం పూర్తికావడంతో వారం రోజులుగా పూజలు కొనసాగుతున్నాయి. నేడు ధ్వజ స్తంభం, విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెస్రం ప్రజలు హాజరుకానున్నారు. మెస్రం వంశస్థులు సొంత ఖర్చులు, చందాలు వేసుకుని 5 కోట్ల తో గుడి నిర్మాణం చేయించారు మెస్రం వంశీయులు.

కేస్లాపూర్ గ్రామం నుంచి నవధాన్యాలు, పూజ సామాగ్రితో వచ్చిన మెస్రం కుటుంబ పెద్ద మెస్రం వెంకట్రావ్ పటేల్ పూజలను ప్రారంభించారు. నవధాయాలతో పాటు నవగ్రహాలను ఏర్పాటు చేసి మధ్యలో ఘాట్‌ను ఏర్పాటు చేసి ఎనిమిది దీపాలు వెలిగించారు. వేదిక వద్ద వెంకటరావు పటేల్ దంపతులు దీపాలు వెలిగించి హారతులతో పూజలు నిర్వహించారు. ఆదివాసీ గిరిజన వేదపండితులు ఆత్రం పురుషోత్తం, కొడప వినాయకరావుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నవగ్రహ పూజలు నిర్వహించారు. గిరిజన ఆదివాసీ దేవుళ్ల ఆలయాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో ఆలయం, కొత్తగా నిర్మించిన స్థలాలన్నింటిపై చల్లారు. నవగ్రహ పూజల్లో ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మెస్రం కులస్తులు పాల్గొన్నారు.

Read also: FIFA World Cup 2022: ఫిఫా తుది సమరం నేడే… నువ్వా నేనా అంటున్న అర్జెంటీనా, ఫ్రాన్స్

నూతనంగా నాగోబా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న ఆలయ శుద్ధి కోసం మెస్రం వాసులు ఐదు ఆలయాల నుంచి పవిత్ర జలాన్ని సేకరించారు. కెరమెరి మండలం విద్యాకాశం, జన్నారం మండలం గోదావరి నది సమీపంలోని హస్తలమడుగు, గుడిహత్నూర్‌ మండలం పులికహాచర్‌, బేల మండలం పెండల్‌వాడ, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ మర్రిచెట్ల తోపు నుంచి ఐదు మట్టి కుండల్లో పవిత్ర జలాన్ని తీసుకొచ్చారు. ఈ పవిత్ర జల కుండలను తెల్లటి వస్త్రంతో కప్పి భద్రంగా ఉంచుతారు. ఈరోజు నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా పవిత్ర జలాలను బయటకు తీస్తారు. వేడుకలను విజయవంతం చేసేందుకు 200 మంది యువకులను వలంటీర్లుగా నియమించారు. ప్రతిరోజు తెల్లని వస్త్రాలు ధరించి భక్తులకు, ప్రముఖులకు సేవలందించనున్నారు.

అయితే నిన్న కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆలయంలో పూజలు చేశారు. నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.10.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
Astrology: డిసెంబర్‌ 18, ఆదివారం దినఫలాలు

Exit mobile version