NTV Telugu Site icon

SLBC: రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు.. మరో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక

Slbc

Slbc

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే టన్నెల్‌లో మట్టి తొలగిస్తేనే తప్ప పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ముమ్మరంగా కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. లోపల పిల్లర్లు వేసి కన్వేయర్ బెల్ట్‌ను రెస్క్యూ బృందం కొనసాగిస్తున్నారు. ఇక చివరి దశలో టీబీఎం మిషన్ కటింగ్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు డీ వాటరింగ్ కొనసాగుతోంది. నీరు ఎక్కువగా ఊరుతుండటంతో మట్టి తవ్వకాలకు ఆటంకం కలుగుతుంది. 7 అడుగుల లోతు తవ్వినా మృతదేహాల ఆనవాళ్లు మాత్రం ఇంకా దొరకలేదు.

ఇక టన్నెల్‌లో మరో ప్రమాదం పొంచి ఉందని రెస్క్యూ బృందం సభ్యులు చెబుతున్నారు. డీ వాటరింగ్ చేస్తున్నా నీటి ఊట మాత్రం ఆగడం లేదు. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట ఊరుతోంది. మరోవైపు మట్టి కూడా కూలుతోంది. జీపీఆర్ గుర్తించిన చోట తవ్వినా ప్రయోజనం లేకుండా పోతుంది.