NTV Telugu Site icon

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై రౌడీ సీట్‌ ఓపెన్‌ చేయాలి.. కాంగ్రెస్‌ నేత డిమాండ్

Guvvala Balaraju

Guvvala Balaraju

ప్రభుత్వ విప్‌, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు నాగర్‌ కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ… కల్వకుర్తిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రులు, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పూర్తి ఖండిస్తున్నాం అన్నారు.. ఇక, సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించిన ఆయన.. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రిని దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదు..? సీఎం అంటే మీకు భయమా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయంలో దళితులకు భూ పట్టాలు ఇస్తే.. వాటిని టీఆర్ఎస్‌ గవర్నమెంట్ గుంజుకుంటుందని విమర్శించారు.. టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఏర్పడినం కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా.. ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారంటూ ఘాటుగా కమెంట్‌ చేశారు.

ఇక, కాంగ్రెస్ పార్టీ దళిత బంధుకి వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన వంశీ కృష్ణ.. కేవలం హుజురాబాద్ లోనే కాకుండా రాష్ట్రం మొత్తం దళితబంధును ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. టీఆర్ఎస్‌ నాయకులు మతిస్థిమితం లేకుండా అధికారం, భయంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని సెటైర్లు వేసిన ఆయన.. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌ ఒక రౌడీ లాగా వ్యవహరిస్తున్నాడని… అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్‌ చేశారు గువ్వల బాల్ రాజ్.. గుంతల బాల్ రాజ్.. గువ్వల బాల్ రాజ్ కాదు.. గుప్తనిధుల బాల్ రాజ్ అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీ దళితులకు భూ సంస్కరణలు చేసిన పార్టీ అని గుర్తుచేశారు వంశీ కృష్ణ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆంధ్రకు తరలిస్తే కమిషన్ లకు కక్కుర్తి పడి అడ్డుకోలేక పోతున్నారంటూ టీఆర్‌ఎస్‌ నేతలపై ఆరోపణలు గుప్పతించిన ఆయన.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్‌ నాయకులు భేషరత్ గా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.. సీఎం మెప్పు కోసం మాట్లాడే మాటలను టీఆర్ఎస్‌ నేతలు బంద్‌ చేసుకోవాలని సలహా ఇచ్చారు.