Nagarjuna Sagar : నాగార్జునసాగర్, జూరాలలో వరద ఉధృతి.. భారీ నీటి విడుదల
- నాగార్జునసాగర్‌లో రికార్డు వరద ప్రవాహం
- గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
- జూరాలలో భారీ ఇన్‌ఫ్లో – ఔట్‌ఫ్లో
- విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న జూరాల ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar : తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాల కారణంగా నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులు రికార్డు స్థాయిలో నీటిని అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3 లక్షల 70 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3 లక్షల 18 వేల క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి కారణంగా 12 గేట్లు 10 అడుగుల వరకు, మరో 14 గేట్లు 5 అడుగుల వరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 585.70 అడుగులుగా ఉండగా, పూర్తి స్థాయి మట్టం 590 అడుగులు. అలాగే పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 299.46 టీఎంసీలుగా నమోదైంది.
Also Read
- Hyderabad: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
ఇక మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టులో కూడా వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో 1,95,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,38,752 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఈ కారణంగా అధికారులు మొత్తం 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1045 అడుగులు కాగా, ప్రస్తుతం అది 1043.143 అడుగుల వద్ద ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 8.512 టీఎంసీలుగా ఉంది. అదే సమయంలో ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల ద్వారా 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అంతేకాకుండా ఎత్తిపోతల పథకాలకు కూడా వరద నీటిని విడుదల చేస్తున్నారు.
CM Revanth Reddy : భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్
తాజావార్తలు
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్‌కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!