Nagarjuna Sagar : తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాల కారణంగా నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులు రికార్డు స్థాయిలో నీటిని అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3 లక్షల 70 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3 లక్షల 18 వేల క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి కారణంగా 12 గేట్లు 10 అడుగుల వరకు, మరో 14 గేట్లు 5 అడుగుల వరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 585.70 అడుగులుగా ఉండగా, పూర్తి స్థాయి మట్టం 590 అడుగులు. అలాగే పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 299.46 టీఎంసీలుగా నమోదైంది.
ఇక మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టులో కూడా వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో 1,95,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,38,752 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఈ కారణంగా అధికారులు మొత్తం 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1045 అడుగులు కాగా, ప్రస్తుతం అది 1043.143 అడుగుల వద్ద ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 8.512 టీఎంసీలుగా ఉంది. అదే సమయంలో ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల ద్వారా 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అంతేకాకుండా ఎత్తిపోతల పథకాలకు కూడా వరద నీటిని విడుదల చేస్తున్నారు.
CM Revanth Reddy : భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్
