Site icon NTV Telugu

Nagarjuna Sagar : భారీగా పెరిగిన వరద.. నాగార్జునసాగర్ 8 గేట్ల ఓపెన్

Nagarjuna Sagar

Nagarjuna Sagar

నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వరద పరిస్థితి మరోసారి తీవ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు పెద్ద ఎత్తున చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులకు చేరడంతో అధికారులు 8 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 65,842 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,09,952 క్యూసెక్కులుగా నమోదైంది. ఇక తెలంగాణకు వాతావరణశాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు ప్రజలకు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు కీలక ప్రకటన

Exit mobile version