Site icon NTV Telugu

మైహోమ్ అధినేత జూపల్లికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

నిర్మాణ రంగంలో ఇప్పటికే ఎన్నో మైలురాళ్లు అందుకున్న మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావును ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఆయనకు గురువారం నాడు తెలంగాణ క్రెడాయ్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా జూపల్లి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు.

అనంతరం జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ… హైదరాబాద్ నగర ప్రగతిలో కన్‌స్ట్రక్షన్ రంగం కీలకంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏడేళ్లుగా హైదరాబాద్ స్వరూపమే మారిపోయిందన్నారు. రాబోయే రోజుల్లో క్రెడాయ్ కీలక పాత్ర పోషించబోతుందని జూపల్లి తెలిపారు. అయితే అక్రమ నిర్మాణాల కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని జూపల్లి అభిప్రాయపడ్డారు.

Exit mobile version