Friend sittings:చిన్న చిన్న కారణాలు కూడా హత్యలు చేసే స్థాయికి వెళ్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో దగ్గినా, తుమ్మినా ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడరేమో అనిపిస్తుంటుంది. చిన్న గొడవలకు ఆవేశంతో ప్రాణాలను తీసేందుకు వెనుకాడటం లేదు. దానికి తోడు మద్యం సేవించి ఉండటం. ఇక ఆ మత్తులో ఏం చేస్తున్నామో అని కూడా గుర్తు ఉండదు. చిన్న మాటకు ఆగ్రహంతో రగిలిపోయి కిరాతకంగా ఎదుటి వారిని హతమార్చేందుకు వెనుకాడటం లేదు. అలా మృగాల్లా తయారవుతున్నారు. భాగ్యనగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. చికెన్ ఫ్రై వండమని స్నేహితుడు అడిగినందుకు ఓ యువకుడిని సిమెంట్ ఇటుకలతో దారుణంగా కొట్టి చంపాడు. వింటుంటేనే ఒళ్లు జలజరించే ఈ ఘటన ప్రతి ఒక్కరినీ షాక్ కు గురిచేసింది. ఇదంతా చికెన్ ఫ్రై కోసమే చేశారా? అనే ప్రశ్నలు రేకిత్తిస్తున్నాయి.
బీహార్‌కు చెందిన ధీరజ్మండల్ , సుశీల్గోస్వామి ఉపాధి కోసం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో జీడిమెట్ల చౌదరిగూడలో సామల నర్సింహారెడ్డి నిర్వహిస్తున్న సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్‌లో పని చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. అయితే అప్పటికే యూనిట్‌లో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన మరో ఇద్దరు సుజిత్ విజయ్ గోస్వామి, బాల నిమేష్‌కుమార్‌లు కూడా వారితో చేరారు. దీంతో స్నేహితులంతా ఒకే చోట ఉన్నాంకదా.. ఎప్పటిలాగే.. ఆదివారం అంటే జూన్ 4వ తేదీ రాత్రి సిట్టింగ్ వేద్దామని ప్లాన్ వేశారు. ధీరజ్ మండల్ సుశీల్ గోస్వామికి మందు కోసం చికెన్ ఫ్రై వండమని చెప్పాడు. కానీ.. సుశీల్ గోస్వామి అందుకు నిరాకరించడంతో ఇద్దరూ గొడవపడ్డారు. ఆగొడవ కాస్త పెద్దదైంది.
ఆగ్రహంతో ఊగిపోయిన ధీరజ్ మండల్ సుశీల్ గోస్వామిని కొట్టేందుకు వెళ్లగా.. మిగతా ఇద్దరు స్నేహితులు అడ్డుకున్నారు. అయితే.. గతంలో కూడా ధీరజ్ మండల్ తన పట్ల ఇలాగే ప్రవర్తించాడని తెలుసుకున్న సుశీల్ గోస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కొట్టేందుకు వచ్చానన్న కోపంతో రాత్రి నుంచి ఆవేశంతో రగిలిపోయిన సుశీల్ గోశ్వరి.. తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ధీరజ్ మండల్ తలపై సిమెంట్ ఇటుకలను ఎత్తి అతికిరాతకంగా హత్య చేశాడు. ధీరజ్ చనిపోయాడని తెలియగానే అక్కడి నుంచి ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌కు పారిపోయాడు. హత్య విషయం వెలుగులోకి రావడంతో.. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారించగా.. అసలు విషయం తెలిసింది. సుశీల్ గోస్వామి కోసం వెతుకుతున్న క్రమంలో రైల్వే స్టేషన్‌లోనే పోలీసులకు దొరికిపోయాడు. అయితే 8 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
GoFirst : GoFirstకు DGCA గ్రీన్ సిగ్నల్.. గాల్లో ఎగరనున్న 22 విమానాలు ?