Revanth Reddy: నన్ను ఆరోజు అన్యాయంగా జైల్లో పెట్టారని, నా బిడ్డ లగ్నపత్రికకు కూడా పోకుండా చేశాడని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంచేస్తోందని వికారాబాద్ కలెక్టరేట్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ..కేసీఆర్ మా తాండూర్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసిన దరిద్రుడు నువ్వే కదా?, 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కూడా నువ్వే కదా? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడేమో వగల ఏడుపు ఏడుస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ లేకుండా చేస్తే కేసీఆర్ కి ఆయన కొడుక్కి ఎదురు ఉండదని అనుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవు లాంటి పార్టీని మోసం చేసావ్ ఆ పాపం ఊరికే పోదని మండిపడ్డారు.
Read also: Team India: వన్డేల్లో టీమిండియా చెత్త రికార్డు.. శ్రీలంకతో సమానంగా..!!
నన్ను ఆరోజు అన్యాయంగా జైల్లో పెట్టారని, నా బిడ్డ లగ్నపత్రికకు కూడా పోకుండా చేశాడని నిప్పులు చెరిగారు. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఇంటికి సిబిఐ వచ్చిందని ఆ పాపం ఊరికే పోదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ నీ బిడ్డ ఇంటికి వస్తే ఆ నొప్పి ఏంటో నీకు తెలుస్తుందని అన్నారు. నీకు ఇప్పుడు తెలుస్తుందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మా ఉసురు నీకు తగులుతుందని మండిపడ్డారు రేవంత్. నీ పార్టీ చీలికలు పేలికలుగా పోతుందని ఆరోపించారు. కేసీఆర్ కి మా కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. చీలికలు తేలికలుగా టీఆర్ఎస్ మారిపోతుందని, ఇవన్నీ చూసి కృంగి కూషించిపోతాడు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ రేవంత్ రెడ్డి.
BJP: 2024 సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. కీలక సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ..