NTV Telugu Site icon

వందశాతం వ్యాక్సినేటేడ్‌ నగరంగా నిలవాలి: కలెక్టర్‌ శర్మన్‌

సికింద్రాబాద్ లోని రసూల్పుర,పికెట్‌ లోని వ్యాక్సినేషన్‌ సెంటర్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పించిన ఈ అవకా శాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజ లు తమంతట తాముగా రెండో డోసు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, అధికా రులు ప్రజలు వాక్సిన్ వేయించుకునేలా వంద శాతం వాక్సినేటెడ్ నగరంగా హైదరాబాద్‌ను తయారు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ ప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వేను పూర్తి చేశామని వ్యాక్సిన్‌ రెండో డోసు వేయించుకుని వారిని గుర్తించి, వారిని వ్యాక్సి నేషన్‌ సెంటర్‌కు వచ్చి వ్యాక్సిన్‌ తీసుకునేలా అధికారులు వారిని ప్రేరేరపించాలన్నారు. అర్హులైన వారందరికీ రెండవ విడత వాక్సినే షన్ వేసుకునేలా చూస్తామని అన్నారు. కలెక్టర్ ఇంటిటికి వెళ్లి అంద రూ వాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. కరోనా ఇంకా అంతం కాలే దని, అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలకు ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇప్పటికైనా కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, కరోనా నివారణకు వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని కలెక్టర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.