NTV Telugu Site icon

Hyderabad: భోలక్ పూర్ లో వింత ఘటన.. విషం పెట్టి పిల్లులను చంపారని ఫిర్యాదు

Cats Dead

Cats Dead

Hyderabad: మారుతున్న సమాజంలో ఎవరు ఎవరికి ఎడిక్ట్‌ అవతున్నారనేది అర్థంకాని పరిస్థితుల్లో ఉంటున్నాము. కుటుంబ కలహాలతో ఒకరినొకరు చంపుకుంటున్న రోజుల్లో మూగజీవాలపై ప్రేమను కురిపిస్తున్నారు. మనషులకంటే మూగజీవాలను పెంచుకుంటే అవి విశ్వాసం చూపుతాయనేది వారి నమ్మకం. మూగ జీవాలను ఇంట్లో పెంచుకునే వారిలో మన దేశంలోనే చాలా మందే వున్నారు. కుక్కలు, పిల్లులు, కోళ్లు, మేకలు ఇలా ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకుంటుంటారు. అది తినకపోతే విలవిల లాడుతుంటారు. కనిపించకపోతే ప్రాణాలే పోయేంత పని జరుగుతంది. ఈ కోవకు చెందిందే ఘటన. తన పిల్లులను ఎవరో విషం పెట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా వాటిని పోస్ట్‌ మార్టం చేసి నేరస్తులను పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు పిల్లుల యజమాని. ఈఘటన హైదరాబాద్‌ లోని భోలక్ పూర్ లో చోటుచేసుకుంది.

Read also: Musheerabad PS: సార్‌ నా మేకపిల్లను కిడ్నాప్‌ చేశారు.. ప్లీజ్‌ వెతికి పెట్టండి

హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్ పూర్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి 10 పిల్లులను పెంచుకుంటున్నాడు. దాన్ని ఇంట్లో పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. అయితే అక్కడే నివశిస్తున్న కాలనివాసులకు ఇబ్బంది ఎదురైంది. పిల్లులు తమ ఇళ్లల్లోకి వస్తూ నానా రభస చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు అందరూ కలిసి పిల్లులు ఇతరుల ఇళ్ళలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయని యజమానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా యజమాని పట్టించుకోలేదు. పిల్లులు బయటకు వస్తే నేను ఏంచేయాలని మీరే తలుపులు పెట్టుకోవాలని బదులు ఇవ్వడంతో.. చేసేది ఏమీ లేక కాలనీ వాసులు వెనుతిరిగారు. అయితే అకస్మాత్తుగా 10 పిల్లులలో 6 పిల్లుల మృతి చెందాయి. ఇంట్లోకి వచ్చిన యజమాని అదిచూసి షాక్ తిన్నాడు. అసలు ఏం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఒక్కటే సారి 6 పిల్లులు ఎలా చనిపోయాయంటూ బాధపడ్డాడు. అయితే యజమాని ఇందతా కాలనీ వాసులపనే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పిల్లులకు కాలనీ వాసులే విషమిచ్చి చంపారంటూ కేసుపెట్టాడు. అంతేకాకుండా.. పిల్లుల మృతదేహాలను తీసుకొని.. గాంధీ మార్చురీకి తీసుకెళ్లాడు. పోస్ట్ మార్టం చేయాలంటూ డాక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. నిబంధనల ప్రకారం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి.. కేసు నమోదు అయితేనే చేస్తామని డాక్టర్ల సూచించారు. తన పిల్లుల మృతి పై దర్యాప్తు చేయలాంటూ.. ముషీరాబాద్ పీఎస్ లో యజమాని పిర్యాదు చేయడంతో ఈ వింత ఘటనపై పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను నియమించిన ప్రభుత్వం