NTV Telugu Site icon

Rangareddy: నవీన్‌ స్టోరీ మళ్లీ రిపీట్‌.. ప్రియురాలి కోసం స్నేహితున్ని చంపేశాడు

Love Story

Love Story

Rangareddy: తెలంగాణలో నవీన్ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ప్రేమకు అడ్డుగా ఉన్న స్నేహితుడు నవీన్‌ను గుండె కోసి శరీరాన్ని ఛిద్రం చేసి హతమార్చాడు హరిహరకృష్ణ. హత్య అనంతరం ఈ విషయాన్ని ప్రియురాలికి చెప్పి వాట్సాప్ లో ముక్కలను చేసిన ఫోటోలను పంపించాడు. ఒళ్లు గగుర్లు పుట్టించే ఘటన మరువకముందే మరో ఇలాంటి ఘటనే వెలుగులోకి రావడంతో స్థానికుల భయాందోళనకు గురయ్యారు. ప్రేయసితో చనువుగా ఉండటాన్ని సహించలేక స్నేహితున్ని మద్యం సేవించి బీర్ బాటిల్ తో పొడిచి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.

Read also: Drumsticks Health Benefits: ములక్కాడలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

20 ఏళ్ల రాజ్ కపిల్ సాహు బీహార్ నుంచి రెండేళ్ల కిందటే తెలంగాణకు వలస వచ్చాడు. అలాగే, 21 ఏళ్ల రాహుల్ సింగ్ అలియాస్ అమర్ నాథ్ కూడా తన కుటుంబంతో అదే రాష్ట్రం నుంచి ఇక్కడికి వలస వచ్చాడు. వారిద్దరూ స్నేహితులు కొత్తూరులో నివసిస్తున్నారు. ఇందులో రాజ్ కపిల్ సాహు టింపాపూర్‌లోని హెచ్‌ఐఎల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరు స్నేహితులు అదే రాష్ట్రం నుంచి వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్న ఓ యువతిని ప్రేమించారు. అయితే ఆ అమ్మాయి కొంతకాలంగా రాజ్ కపిల్‌తో డేటింగ్ చేస్తోంది. దీన్ని రాహుల్ సింగ్ తట్టుకోలేకపోయాడు. దీంతో తన స్నేహితుడిని హతమార్చేందుకు పథకం వేశాడు. ఇందుకోసం వారు నివసించే కొత్తూరుకు చెందిన పాత నేరస్థుడు 19 ఏళ్ల మహ్మద్ తాహెర్‌తో పాటు మరో ఇద్దరు మైనర్ల సహాయం తీసుకున్నారు. వీరంతా ఈ నెల 18న సాయంత్రం రాజ్ కపిల్ తో కలిసి మద్యం సేవించాలని ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా తిమ్మాపూర్ సమీపంలోని పాత వెంచర్ వద్దకు తీసుకెళ్లారు.

Read also: Her: Chapter 1 Movie Review: హర్: చాప్టర్ 1

ఈ క్రమంలో అందరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం బీరు సీసాలు పగలగొట్టి వాటితో పొడిచారు. అలాగే అక్కడే ఉన్న రాయితో తలపై కొట్టాడు. దీంతో రాజ్ కపిల్ సాహు మృతి చెందాడు. అనంతరం మృతదేహంపై కొంత మట్టిని కప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రాజ్ కపిల్ కనిపించకపోవడంతో హెచ్‌ఐఎల్ పరిశ్రమ కాంట్రాక్టర్ సోనుకుమార్ ఆందోళనకు గురయ్యాడు. రాహుల్ సింగ్ అలియాస్ అమర్ నాథ్ తన స్నేహితుడి గురించి అడగగా పొంతలేని సమాధానం చెప్పడంతో.. అనుమానం వచ్చిన కాంట్రాక్టర్ సోనుకుమార్ మరుసటి రోజు అంటే జూలై 19న ఈ విషయమై పోలీసులను ఆశ్రయించాడు. రాహుల్ సింగ్ అలియాస్ అమర్ నాథ్ సహా మరికొందరిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా కపిల్ గదిలో ఉన్న ఓ వ్యక్తిని రాజ్ ప్రశ్నించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో రాహుల్ సింగ్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెల్లడించాడు. అంతేకాకుండా నేరం తానే చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అతనితో పాటు ఈ హత్యకు పాల్పడిన ఇతర నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ రాంచందర్‌రావు తెలిపారు.
Samajavaragamna : ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ప్రకటించిన ఆహా ఓటీటీ సంస్థ..