NTV Telugu Site icon

Poster war in Munugode: అప్పుడు నెగిటివ్.. ఇప్పుడు పాజిటివ్.. మునుగోడులో పోస్టర్ వార్

Poster War In Munugode

Poster War In Munugode

Poster war in Munugode: మరోసారి నారాయణపురం మండల కేంద్రంలో పోస్టర్లు వెలిశాయి. గతంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు రాగా… తాజాగా బీజేపి పార్టీ తమ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి అనుకూల పోస్టర్లు వెలిసింది. నీ దిక్కారంతోనే మునుగోడు ప్రజల కలలు నెరవేరుతున్నాయని… గట్టుప్పల మండల ఏర్పాటు, నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం.. జరుగుతున్న అభివృద్ధి నీ రాజీనామావల్లే ధన్యవాదాలు అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల వ్యవహారం, పార్టీ మార్పు, ఉప ఎన్నికల్లో బిజెపి ఇస్తున్న హామీలపై గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు వేయగా… ఆ పోస్టర్ లు నియోజకవర్గంలో కలకలం రేపాయి.. తాజాగా రాజగోపాల్ రెడ్డికి అనుకూల పోస్టర్లు వేయడంతో పోస్టర్ల పోరాటం మరో రూపం దాల్చింది.

Read also: Missing Case: కడపలో ఏడో తరగతి విద్యార్థిని మిస్సింగ్.. మూడు రోజులు దాటినా దొరకని ఆచూకీ

గత ఐదురోజుల ముందు చండూరులో వెలిసిన పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చండూరులో రాత్రికి రాత్రి Phone Pay తరహాలో Contract Pe, 18000 కోట్లు transaction కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికు కేటాయించడం జరిగిందని వేల సంఖ్యలో షాపులకు, గోడలకు వెలశాయి. పేసీఎం తరహా Contract Pe అంటూ వెళిసిన పోస్టర్లు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. గత కొంతకాలంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడని విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరాడని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. మరి ఈ పోస్టర్లపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read also: Karimnagar Bear Migration: మళ్లీ ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో శాతావాహన విద్యార్థులు

ఈనెల 15న మునుగోడు ఉప ఎన్నికల్లో పోస్టర్ల వార్ హీట్ పుట్టిస్తోంది. మొన్నటికి మొన్న పేటీఎం తరహాలో పే కాంట్రాక్టర్ అంటూ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వ్యంగ్య పోస్టర్లు మునుగోడు నియోజకవర్గమంతా కలకలం సృష్టించగా మరో తరహా పోస్టర్లు చూసి జనం చర్చించుకుంటున్నారు. ”ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి” ఇట్లు దుబ్బాక ప్రజలు అని కొన్ని పోస్టర్లు ‘ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి’ ఇట్లు హుజూరాబాద్ ప్రజలు అంటూ మరి కొన్ని పోస్టర్లు చౌటుప్పల్ మున్సిపాలిటీ అంతటా వెలిశాయి. ఈఏడాది ఆగస్టు 14న మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి. అందులో రాజగోపాల్ రెడ్డిని మునుగోడు నిన్ను క్షమించదు అని రాశారు. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏళ్ల న‌మ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి అని రాసి ఉండటంతో కలకలం రేపుతున్నాయి. అయితే ఇవాళ రాజగోపాల్‌ రెడ్డికి అనుకూల పోస్టర్లు రావడంతో.. సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. అప్పుడలా ఇప్పుడిలా ఏంటని చర్చలు జరుగుతున్నాయి.
Street Dogs Poison: 18 వీధికుక్కల మృతి ఘటనపై కేసు.. చేబ్రోలు పోలీసుల దర్యాప్తు