Revanth Reddy Padayatra in Munugodu: స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజక వర్గంలో మన మునుగోడు, మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ఏర్పాటు చేసారు కాంగ్రెస్ శ్రేణులు. 175 గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేయాలని నిర్ణయించాయి. ఆరు మండలాలు, ఒక ప్రతిపాదిత మండల కేంద్రాల్లో జరిగే పాదయాత్రల్లో పీసీసీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పొర్లుగడ్డతండాలో జరిగే పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. పాదయాత్ర సందర్భంగా మన మునుగోడు – మన కాంగ్రెస్ కరపత్రాలను ప్రతి బూత్‌లో అంటించాలని పార్టీ శ్రేణులకు పీసీసీ నేతలు పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌నాయక్ పర్యవేక్షిస్తున్నారు.
నేడు ఉదయం రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి పాల్గొని, 12 గంటలకు చౌటుప్పల్ లో ప్రెస్ మీట్ లో నిర్వహించనున్నారు. ఈ ప్రెస్‌మీట్ కు నాయకులు, కార్యకర్తలు మీ కార్యక్రమాల తర్వాత చౌటుప్పల్ కు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యానికి వందనం పేరుతో కార్యక్రమం వుంటుందన్నారు. ఒక్కో నాయకుడు వంద మందికి వందనం చేస్తారు. వెయ్యి మంది నాయకులు..లక్ష మందికి వందనం చేసి ప్రజాస్వామ్యం కాపాడండి అని అడుగుతాం. తెలంగాణ సాయుధ పోరాట యోధుల కుటుంబాలకు రేవంత్ వందనం చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఇవాళ సీఎం కేసీఆర్ సభ రోజే నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేయడం, అందులోనూ రేవంత్‌రెడ్డి పాల్గొనుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి..!
