NTV Telugu Site icon

Munugode Bypoll Results: మునుగోడులో రౌండ్‌ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యం

Bjp Trs

Bjp Trs

Munugode Bypoll Results: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మునుగోడులో రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్‌ తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్‌ కు నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌ 228, బీజేపీ 224, బీఎస్సీ-10, ఇతరులకు 88 ఓట్లు పోల్‌ అయ్యాయి. తొలి రౌండ్‌ లో టీఆర్ఎస్‌ కు 1192 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉంది. ఫస్ట్‌ రౌండ్‌ లో టీఆర్‌ఎస్‌ కు 6,096 ఓట్లు రాగా, బీజేపీకి 4904, కాంగ్రెస్‌కు 1877 ఓట్లు వచ్చాయి

Read also:Chhattisgarh: మైనర్ విద్యార్థినులపై టీచర్ తండ్రి లైంగిక వేధింపులు

నియోజక వర్గంలో 2,41,855 ఓటర్లు ఉండగా.. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25, 878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూలేని విధంగా 93.41శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4గంటల వరకు తుదిఫలితం వెల్లడి కానుంది. ఇక రెండో రౌండ్‌లో 789 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. చౌటుప్పల్‌ అర్బన్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో రౌండ్ ముగిసేసరికి 515 ఆదిక్యంలో టీఆర్ఎస్ ఆదిక్యంలో వుంది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు మొదలైంది.