Munugode By Election Results: అనుకున్న మెజార్టీ రావడం లేదంటూ మునుగోడు బరిలో వున్న అభ్యర్థులు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అసహనం వ్యక్తం చేస్తూ కౌంటర్ సెంటర్ నుంచి వెళ్లిపోవడం చర్చకు దారితీస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో కొనసాగుతుంది. అయితే.. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. ఇక, కాంగ్రెస్ మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన పాల్వాయి స్రవంతి తీవ్ర నిరాశ చెంది కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ రోజు ఉదయం కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న సమయంలో పాల్వాయి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ.. విజయంపై ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సక్సెస్ అవుతాయని లేదుగా ప్రశ్నించగా.. ఇప్పటివరకు వెలువడిన ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావడం, బీజేపీ, టీఆర్ఎస్‌లతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు పోలు కావడంతో పాల్వాయి స్రవంతి నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.
Read also: Srilanka arrests Indians: 15 మంది భారతీయులను అరెస్ట్ చేసిన శ్రీలంక
ఇక చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదని సహనం వ్యక్తం చేశారు. ఫలితం ఎలానైనా ఉండొచ్చన్నారు. చివరికి వరకు హోరా హోరీ తప్పకపోవచ్చని ఆయన అన్నారు. ఇప్పటివరకైతే టీఆరెఎస్ ఆధిక్యంలో ఉందని అన్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని తెలిపారు.బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నాలుగు రౌండ్ లు అయిపోయే సరికి టీఆర్‌ఎస్ ముందంజలో ఉందని అన్నారు. చౌటుప్పల్ రూరల్ నారాయణ్ పూర్ గ్రామంలో బీజేపీ మెజార్టీ వస్తుందని నమ్మకం ఉండేదని అన్నారు. 4 రౌండ్లలో టీఆర్ ఎస్ మెజార్టీ వున్నా ఇంకా 11 రౌండ్లు వున్నాయని అన్నారు. తప్పకుండా ఇది హోరా హోరీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మునుగోడు ప్రజల కోసం వేచి చూడాల్సిందే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.