Tiger in Mulugu: భద్రాద్రి నుంచి మళ్లీ ములుగులోకి ప్రవేశించిన పెద్ద పులి..
- భద్రాద్రి జిల్లా వైపు వెళ్లిన పెద్ద పులి మళ్లీ ములుగు జిల్లా అడవుల్లోకి..
- పెద్ద పులి గమనాన్ని ఎప్పటి కప్పుడు పరిశీలిస్తున్న అటవీ శాఖ సిబ్బంది..
- పెద్ద పులికి ఆపద రాకుండా చూసుకోవాలని అటవీ గ్రామస్తులకు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger in Mulugu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించ పెద్దపులి ఇప్పుడు మళ్లీ ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి ప్రవేశించింది. పెద్ద పులి ములుగు తాడ్వాయిలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నర్సాపూర్ సమీపంలోని గౌరారం వాగు పెద్దపులి అడుగు జాడలు గుర్తించారు. చౌలేడు, కేశవపురం గ్రామల వైపు పెద్దపులి వెళ్ళి వుంటుందని ఎఫ్అర్ఓ సత్తయ్య తెలిపారు. వారం రోజులుగా మంగపేట,తాడ్వాయి, కరకగుడేం,గుండాల అడవుల్లో పెద్దపులి మకాం వేసినట్లు గుర్తించారు. అడవి ఉత్పత్తుల సేకరణ, పశువుల మేత కోసం గ్రామస్తులు అడవులకు వెల్లకుండా ఫారెస్ట్ అధికారులు నియంత్రిస్తున్నారు. పెద్ద పులి గమనాన్ని ఎప్పటి కప్పుడు అటవీ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు. పెద్ద పులికి ఆపద రాకుండా చూసుకోవాలని అటవీ గ్రామస్తులకు అధికారులు సూచిస్తున్నారు. ఈ పెద్దపులి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి, ఇటు ములుగు జిల్లాలోకి తిరుగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు.
Read also: Telangana Assembly Live 2024: అసెంబ్లీ సమావేశాలు లైవ్..
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
గత మూడేళ్ల క్రితం కూడాకరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పర్యటించిందని అటవీశాఖ అధికారులు అన్నారు. అప్పట్లో ఒక ఆవుని కూడా పులి చంపి తిందని, ఆ తర్వాత నుంచి పులి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయని అన్నారు. మళ్ళీ తిరిగి పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో గత మూడు రోజుల నుండి పులి కలకలం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. గుండాలకు సరిహద్దు అడవులైన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పులి సంచరించినట్టు అధికారులు గుర్తించారు. అక్కడి నుండి గుండాల ఆళ్లపల్లి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని, అడవుల సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. పులి ఎప్పుడొచ్చి తమను ఏ ప్రమాదానికి గురి చేస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 2020 సంవత్సరంలో ఆళ్లపల్లి మండలం మార్కోడు అడవుల్లో పులి సంచరించి ఓ రైతును, ఎద్దును చంపివేసిన విషయం తెలిసిందే.
Hyderabad Weather: గజగజా వణికిపోతున్న రాష్ట్రం.. ఆ జిల్లాలకు హెచ్చరిక..
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!