NTV Telugu Site icon

Minister Seethakka: మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే.. రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది..

Miniser Seetakka

Miniser Seetakka

Minister Seethakka: మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లా ఏర్పడిన నాటి నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళుటకు అన్ని ప్రాణాళికలు రూపొందించామన్నారు. జిల్లాలో నూతన కలెక్టరేట్ భవననిర్మాణాలు,సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేసామని తెలిపారు. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలలోని ఆదివాసి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు రాష్ట్రంలోనే తొలిసారిగా రెండు కంటైనర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసామన్నారు.

Read also: IMD Weathter: నేడు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే ఛాన్స్..

సమ్మక్క- సారలమ్మ మేడారం జాతరకు గతంలో ఎన్నడు లేని విధంగా 110 కోట్లు వెచ్చించి ఒక కోటి 50 లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతర నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మిలను చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసి బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి పేదలకు మెరుగైన వైద్యసేవాలు అందిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధుల నిర్ములనకు 15 రోజులకు ఒకసారి ఇంటింటికి జ్వరం సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమ్మక్క – సారాలమ్మ గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం కోసం 337 ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది. త్వరలో తరగతులు ప్రారంభం కానున్నాయనిత తెలిపారు. ప్రజా పాలన ద్వారా ప్రజల నుండి అభయ హస్తం ఆరు గ్యారెంటిలకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు.

Read also: Dr MP Laxman: ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యింది..

గృహజ్యోతి, మహాలక్షి పథకాలు రాని దరఖాస్తుదారుల డేటా ప్రాజాపాలన మండల సేవా కేంద్రాల ద్వారా సరిచేస్తున్నామని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలు ఎదగాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి కాంటీన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు కలిపిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు 2 లక్షల వరకు రుణబీమా,పది లక్షల వరకు ఇందిరా జీవిత బీమా పథకం ప్రవేశ పెట్టాలన్నారు. మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు తేలాల్సి ఉంది..