నేడు ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి రానున్నారు. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం.. గ్రామస్థులతో సమావేశమై సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి మేడారం వెళ్లి సమ్మక్క-సారలమ్మలను దర్శనం చేసుకోనున్నారు. కాగా.. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.
Read Also: Tragedy: హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
గవర్నర్ పర్యటన షెడ్యూల్..
గవర్నర్ ములుగు జిల్లా పర్యటన షెడ్యూల్‌నుయ అధికారులు విడుదల చేశారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్ నుంచి ఉదయం 8 గంటలకు రోడ్డుమార్గాన బయలు దేరి 10:30 గంటలకు ములుగుకు చేరుకుంటారు. గట్టమ్మ సమీపంలోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో కొద్దిసేపు సేద తీరుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి 11:15 గంటలకు తాడ్వాయి మండలం కొండపర్తికి చేరుకుంటారు. అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత గ్రామస్థులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:45 గంటలకు మేడారం వెళ్తారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. స్థానిక ఐటీడీఏ అతిథి గృహంలో భోజనం చేసిన తర్వాత 2:30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.