NTV Telugu Site icon

Wazedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్..

Wazedu Si

Wazedu Si

Wazedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక విషయాలను పోలీసులు తెలిపారు. ఎస్ఐ హరీశ్ ను ఓ యువతి బ్లాక్ మెయిల్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, సదరు యువతి స్వస్థలం సూర్యాపేట జిల్లా దూద్వా తండాగా తేలింది. ప్రేమ పేరుతో ఎస్ఐను ఆమె బ్లాక్ మెయిల్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ యువతి ఒత్తిడి కారణంగానే వాజేడ్ ఎస్ఐ హరీశ్ సూసైడ్ చేసుకున్నారని వెల్లడించారు. ఇక, ఎస్ఐ తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: AP School Education: ఏపీ విద్యాశాఖ వినూత్న నిర్ణయం.. దేశంలోనే తొలిసారి..!

అయితే, డిసెంబర్ 2వ తేదీ ములుగు జిల్లాలోని ముళ్లకట్ట సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్‌లో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడ్ ఎస్ఐ హరీశ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత ప్రచారం జరిగింది. ఏటూరు నాగారంలో ఎన్‌కౌంటర్‌ జరిగిన రాత్రే ఆయన సూసైడ్‌ చేసుకోవడంతో పలు అనుమానాలకు దారి తీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు విచారణ చేసి అసలు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Show comments