Site icon NTV Telugu

ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి బదిలీ..

Court

Court

ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు జడ్జి జ‌స్టిస్ సీహెచ్‌వీఆర్ఆర్ వరప్రసాద్ ను తెలంగాణ‌ ఉన్నత న్యాయ‌స్థానం బదిలీ చేసింది. ఈ మేర‌కు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐ స్పెష‌ల్ కోర్టు-1 అద‌న‌పు జ‌డ్జిగా వ‌ర‌ప్రసాద్ కు బాధ్యత‌లు అప్పగించింది న్యాయస్థానం… ఇక, ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోర్టు న్యాయమూర్తిగా కె.జయకుమార్ ను నియ‌మించింది. జ‌స్టిస్ జ‌య‌కుమార్ ప్రస్తుతం వరంగల్ ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.. దీంతో.. ఎంఎస్‌ రామచంద్రరావును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ గెజిట్‌ విడుదల చేసింది కేంద్ర న్యాయశాఖ.

Exit mobile version