Site icon NTV Telugu

Uttam Kumar Reddy : సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థను సర్వనాశనం చేసాడు

Uttam Kumar

Uttam Kumar

తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థ సర్వనాశనం చేసాడంటూ విమర్శలు గుప్పించారు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేజీ టూ పీజీ ఉచిత ఆంగ్ల విద్య కు అతీగతీ లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వ్యవస్థ ను కూడా కాపాడలేకపోయాడని ఆయన విమర్శించారు. 12 లక్షల మంది విద్యార్థులకు 3,270 కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు.. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.. 2020 – 22 సంవత్సర కాలం ఫీజు రీఏంబర్స్ మెంట్ ఇంత వరకు విడుదల చేయలేదు.. 3600 విద్యాసంస్థలు దెబ్బతింటున్నాయి.. 2014 తరువాత 850 జూనియర్, 350 డిగ్రీ ,150 పీజీ , వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు మూతపడ్డాయి.. ఫీజు కట్టలేక 30 శాతం విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారు.. కాంగ్రెస్ ప్రభుత్వం లో అడగకుండానే 100 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసాం.. ఉన్నత విద్య కి నిధులు కేటాయించడం లేదు.. 50 శాతం ఖాళీలు ఉన్నాయన్నారు.

 

 

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.. మన ఊరు మన బడి కోసం ఫిబ్రవరి 3 న ప్రకటించారు 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేసారు.. 3497 కోట్లు ఖర్చు చేస్తామని ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు.. 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. బీఈడీ కాలేజీ లో 166 టీచర్ లకు 155 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. డీఈవో పోస్టులు 33 జిల్లాలకు 10 మంది ఉన్నారు.. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం విద్యా వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చు.. మైనార్టీ విద్యా సంస్థలు 90 శాతం మూతపడ్డాయి.. 2014 నుండి ఇప్పటి వరకు 1.2 లక్షల విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేశారని ఆయన వ్యాఖ్యానించారు.

 

Exit mobile version