Site icon NTV Telugu

MP Santosh Kumar: విజ‌యేంద్ర ప్ర‌సాద్ కు ఎంపీ సంతోష్ అభినంద‌న‌లు

Vijayendravarma

Vijayendravarma

ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్రప్రసాద్ కు ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట‌ర్ ద్వారా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు. భారత రాష్ట్రపతి చేత రాజ్యసభకు నామినేట్ అయినందున మన సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మన స్వంత కథా రచయిత విజయేంద్రప్రసాద్ అంటూ ట్విట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయన లైక్స్‌తో ఫ్లోర్‌ను పంచుకోవడం నాకు గౌరవంగా ఉంటుంటూ.. ట్విట‌ర్ ద్వారా ఎంపీ సంతోష్ కుమార్ అభినంద‌న‌ల వ‌ర్షం కురిపించారు. ఎంపీ సంతోష్ కుమార్ తో ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్రప్రసాద్ వున్న ఫోటోను ట్వీట్ చేసి త‌న అభిమానాన్ని చాటుకున్నారు.

కాగా.. దిగ్గజ స్వరకర్త ఇళయరాజా, ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్ర ప్రసాద్ బుధవారం రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్ల అనంతరం ప్రతిష్టాత్మకంగా నిలిచిన కళాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాజ్యసభకు అర్హులైన ప్రముఖులను ఎంపిక చేసినందుకు ప్రధాని మోడీకి ట్విట్టర్ వేదిక‌గా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

అయితే.. కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో నాగార్జున, విజయశాంతి న‌టించిన జానకి రాముడు చిత్రంతో విజయేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన..ఆయన రైటర్ గా పనిచేశారు. అలాగే దర్శకుడిగా అర్ధాంగి, శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లి వంటి చిత్రాలను తెరకెక్కించారు. అలాగే సమరసింహా రెడ్డి, సింహాద్రి, సై, విజయేంద్ర వర్మ, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, బాహుబలి సిరీస్, బజరంగీ భాయ్ జాన్, మెర్సల్, మ‌ణికర్ణిక, త‌లైవి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల‌కు రైట‌ర్ గా ప‌నిచేశారు. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీకి కూడా రైటర్ గా పనిచేస్తూ.. రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం స్క్రిప్ట్ పై చాలా కాలం నుంచి వ‌ర్క్ చేస్తున్న విష‌యం తెలిసిందే..ఇనాళ్ల‌కి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కి ఈ గౌర‌వం ద‌క్క‌డంతో అందరూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version