తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వ్యక్తిగత విమర్శలు మానుకో అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎంపీ రంజిత్ రెడ్డి హెచ్చరించారు. చాతనైతే ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం పార్లమెంట్‌లో మాతో పాటు కొట్లాడు అని ఆయన అన్నారు. వరి కొనుగోలు కోసం కేంద్రంతో ఎంపీలం పోరాటం చేస్తే మాతో పాటు పోరాటం చేయడానికి రావడానికి చాతకాలేదని ఆయన విమర్శించారు. అంతేకాకుండా నేను వ్యాపారిని, గుడ్ల వ్యాపారం చేస్తే తప్పా? ప్రజా సేవా చేద్దం అనుకున్న చేస్తున్నా అని ఆయన మండిపడ్డారు. చేతనైతే చేవెళ్ల నుంచి పోటీ చేద్దంరా. నువ్వానేనా చూసుకుందాం అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. వ్యక్తి గత విమర్శలు మానుకో, మేము డిగ్నిటీ మేంటనేస్ చేస్తున్నాము అని ఆయన వ్యాఖ్యానించారు.
MP Ranjith Reddy : వ్యక్తిగత విమర్శలు మానుకో రేవంత్ రెడ్డి..
