తెలంగాణ సీఎంకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు. తన కుటుంబాన్ని , తనకు హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. కాగా.. అందుకోసమే హైదరాబాద్ ఎమ్మార్ బౌల్డర్ హిల్స్‌లోని తన నివాసం సమీపంలో పదే పదే రెక్కీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే.. జులై 4న తన ఇంటి సమీపంలోని కొందరు రెక్కీ నిర్వహిస్తుండగా.. అందులో ఒకరిని సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని ప్రశ్నిస్తే ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన బాషా అని చెప్పాడని రఘురామ తన లేఖలో తెలిపారు.
అయితే.. ఐడీ కార్డు అడిగితే చూపించలేదని.. ఉన్నతాధికారుల వివరాలుకూడా చెప్పలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. అతడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని, కానీ.. ఏపీ పోలీసులకు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మద్దతిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుని తెలంగాణలో శాంతి భద్రతలు రక్షించాలని లేఖలో రఘురామ కోరారు.
అయితే.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్.. పీఏ శాస్త్రి.. సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ.. కానిస్టేబుల్‌పై గచ్చిబౌలి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్‌పై దాడి చేసిన కేసులో వారిపై ఈ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా.. కానిస్టేబుల్ ఫరూక్‌పై దాడికి దిగిన సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండు చేసినట్లు అమరావతిలోని ఏపీ పోలీసు విభాగం ప్రకటించింది. అయితే.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటితో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ విధులకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసులు పేర్కొన్నారు.
Kaduva: మలయాళం తప్ప మిగిలిన భాషల్లో ఓ రోజు వెనక్కి!