NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ముఖ్యమంత్రి పదవిపై తేల్చేశారు..!

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి.. కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్ అన్న ఆయన.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడని స్పష్టం చేశారు.. గుండాలలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోరాట సమయంలోనే నేను సోనియా గాంధీకి మాట ఇచ్చా… తప్పకుండా తెలంగాణ ఇస్తాం.. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండాలని ఆమె చెప్పారు.. అదేరోజు ఆమెకు మాట ఇచ్చా.. చనిపోయే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని.. మరోసారి స్పష్టం చేస్తున్నా.. నేను చచ్చేవరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానన్నారు కోమటిరెడ్డి. ఇక, నేను పార్టీ పదవిని మాత్రమే ఆశించాను… మంత్రి, ముఖ్యమంత్రి పదవులు నాకు అవసరం లేదన్నారు కోమటిరెడ్డి… కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ముందస్తుగా టికెట్లు ప్రకటించరు.. అయితే, ఎన్నికలకు ముందు సర్వే చేసి 6 నెలల ముందు టికెట్లు ప్రకటించాలని సూచించారు.

Read Also: Jagga Reddy: డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయండి..!

మరోవైపు, టీఆర్ఎస్‌ పార్టీలో ఎవరు బయట ఉంటారో.. ఎవరు లోపలికి వెళ్తారో తెలియని పరిస్థితి.. రాష్ట్రంలో పనికిరాని మంత్రులు ఉన్నారంటూ ఫైర్‌ అయ్యారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కాగా, ఆయన సోదరుడైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీలో చేరిన తర్వాత.. ఇక వెంకట్‌రెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరిగింది.. కానీ, ఆ ప్రచారాన్ని ఆయన సీరియస్‌గా తిప్పికొడుతూనే ఉన్నారు.. కొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా ఆయనపై నోరుజారి.. మళ్లీ క్షమాపణలు చెప్పిన పరిస్థితి.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి తన సోదరుడు బరిలోకి దిగడంతో.. ఉప ఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారా? లేదా? అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.. అయితే.. తన సోదరుడు పోటీ చేస్తుండడంతో.. ఎన్నికల ప్రచారానికి తాను దూరంగా ఉంటానని ఆయన అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది.. ఇక, ఇదే సమయంలో ఆయన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లనున్నారనే ప్రచారం కూడా సాగుతోన్న విషయం తెలిసిందే.. కొందరు చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి.. అందుకే తాను మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Show comments