NTV Telugu Site icon

Komatireddy: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఈ నెల రోజులైన 24 గంటల కరెంట్ ఇవ్వండి

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy venlat reddy: మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఈ నెల రోజులు అయిన 24 గంటల కరెంట్ ఇవ్వండి కేసీఆర్ గారు అంటూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కోతల అంశం ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనల్లో కేసీఆర్ 2,3 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా? 24 గంటలు కరెంట్ కావాలా అని ప్రజలకు చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో ఎక్కడ కూడా 12, 13 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు. రానున్న రోజుల్లో ఇందులో కూడా కోత ఉండనుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు కరెంట్ కోతతో ఇబ్బంది తప్పేలా లేదని అన్నారు. ఇప్పటికీ నాకు కరెంట్ కోతపై నల్గొండ మండలం నుంచి పిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.

Read also: Jawan Trailer: ఇండియాస్ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఈజ్ బ్యాక్…

నల్గొండ మండలం అప్పాజీ పేటలో వారం నుంచి కనీసం 6 గంటలు కూడా కరెంట్ రావడం లేదని మండిపడ్డారు. పొలాలు ఎండిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ 24 గంటలు ఇచ్చేంత కరెంట్ మీద దగ్గర లేకపోతే చెప్పండి.. పక్కా రాష్ట్రాల నుంచి అయిన కొని ప్రజలకు 24 గంటల కరెంట్ ఇవ్వండని తెలిపారు. ప్రభుత్వం మాటల నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారని అన్నారు. మీరిచ్చిన రైతు బంధు డబ్బులు.. రైతు తెచ్చిన పెట్టుబడికి వడ్డీ కట్టేందుకు కూడా సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కరెంట్ అయిన పూర్తి స్థాయిలో ఇచ్చి రైతు నష్టపోకుండా చూడాలని కేసీఆర్ ను కోరుతున్నానని అన్నారు. మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఈ నెల రోజులు అయిన 24 గంటల కరెంట్ ఇవ్వండి కేసీఆర్ గారు.. అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Bandi Sanjay: బండి సంజయ్ అమెరికా పర్యటన.. 10 రోజుల పాటు యూఎస్‌లోనే!