Site icon NTV Telugu

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇదివరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా లభించింది. కిషన్ రెడ్డికి పదోన్నతి లభించడం, పైగా పర్యాటక మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోండటంతో కోమటిరెడ్డి ఆయనను కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా తగిన నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అయితే వీరిద్దరూ సమావేశం సాధారణమే అని తెలుస్తున్నప్పటికీ.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటుండటంతో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది.

Exit mobile version