K Laxman: మేము చరిత్రని వక్రీకరించలేదు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP K Laxman Demands Apoligies From CM KCR: తెలంగాణ విమోచన అసలు చరిత్రను తాము చెప్తున్నామని, తాము చెప్పేది సజీవ సాక్ష్యమని, చరిత్రను వక్రీకరించడం లేదని ఎంపీ కే. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినంగా ఎందుకు అధికారికం చేయలేదో చెప్పాలని.. అందుకు ఆయన క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాల కోసం మజ్లిస్‌కి టీఆర్ఎస్ లొంగిపోయిందని ఆరోపణలు చేశారు. కేంద్రం ‘విమోచన దినోత్సవం’ చేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంతో విమోచన పోరాటంలో అసువులు బాసిన వారి చరిత్ర వెలుగులోకి వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సమైక్యత పేరుతో మసి పూసి మారేడు కాయ చేస్తోందని ఆరోపించారు. మత కోణంలో చూశారు కాబట్టే కేసీఆర్ ఈ ఉత్సవాలు జరపలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. విమోచన ఉద్యమ చరిత్రను పాఠ్యాంశంలో పెడతామని హామీ ఇచ్చారు.
అటు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ కొన్ని సంవత్సరాలుగా ఉద్యమిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాడూ విమోచనాన్ని పట్టించుకోలేదని.. అమరులైన వీరులను, వారి త్యాగాలను గుర్తించలేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆమరుల త్యాగాలు, వారి ఆశయాలను నెరవేర్చడంతో పాటు.. ఈ సాయుధ పోరాట చరిత్రను, వీరుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Fauzi premieres : వరల్డ్ వైడ్‌గా ఒకరోజు ముందుగానే ‘ఫౌజీ’ ప్రీమియర్స్.. కన్ఫామ్ చేసిన మైత్రి రవి
-
Suriya-Jyothika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా వస్తారా?.. వైరల్ అవుతున్న సూర్య, జ్యోతిక ఫోటోషూట్!
-
Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!
-
Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
-
Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!