తెలంగాణ ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం పైసలే ఉన్నాయని, బీజేపీని విమర్శించడానికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అర్హత లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘2023లో తెలంగాణలో భారతీయ జెండాను ఎగురవేస్తాం. నన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నా.. తెలంగాణలో ధర్మం గురించి పాటుపడతానని బండి సంజయ్ తెలిపారు.
దళిత బంధు సిరిసిల్లలో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈరోజు తెలంగాణలో సర్పంచులు పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు.. సర్పంచ్ లు బిల్లులు రాక వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటున్నారు. గంభీరావుపేట మండలంలో బ్రిడ్జి కట్టలేని మంత్రి కేటీఆర్ మమ్మలిని ప్రశ్నిస్తున్నారు. బ్రిడ్జి లేక బస్సు వాగులో కొట్టుకుపోయింది. సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి కేటీఆర్ ఏం చేశాడో తెలపాలి. ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం పైసలే ఉన్నాయి. మేము సిరిసిల్ల జిల్లాలో ఇసుక దందా చేస్తలేమని కేటీఆర్ అడ్డాలో బండి సంజయ్ పంచులు వేశారు.
తెలంగాణలో సన్నం వడ్లు పండించిన రైతుల పరిస్థితి ఏమైంది. వరి వేస్తె ఉరి అంటుండు కేసీఆర్. రైతులను బెదిరిస్తుండు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు. కేంద్రం వడ్లు కొంటుంది తెలంగాణ రాష్ట్రం కూడా వడ్లు కొనాలేనని ఆయన డిమాండ్ చేశారు. ఎంత మందికి డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారో స్థానిక నాయకులు తెలుపాలే. ఇవన్నీ మాట్లాడితే బండి సంజయ్ మతతత్వ వాది అని అంటున్నారు. ప్రతి హింద్ పండుగ జరుపుకోవాలంటే పెర్మిషన్లు కావాలి.
తెలంగాణలో పేదోళ్ల ప్రభుత్వం రావాలంటే 2023లో బీజేపీని గెలిపించాలన్నారు. తెలంగాణలో కుటుంబపాలనను అంతం చేయాలి. కరెంటు చార్జీలు పెంచిన, బస్సు చార్జీలు పెంచిన ప్రభుత్వాన్ని మేం ఆడ్డుకుంటాం. కేసీఆర్ ఆర్టీసీని అమ్మేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. నాడు ఉద్యమాల గడ్డ అయిన సిరిసిల్ల జిల్లాలో నేడు ఉద్యోగాలు రాక నిరుద్యోగత ఏర్పడింది. కలిసికట్టుగా ఉద్యమం చేయండి నేను మీతో ఉంటా. మీకు అండగా ఉంటా’నని బండి సంజయ్ కోరారు.
