Site icon NTV Telugu

Owaisi: తక్కువ అంచనా వేయొద్దు.. దేశంలో కేసీఆర్‌ని మించిన నేత లేరు..

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఎంఐఎం రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వ విధానాలను ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్‌ ప్రశ్నిస్తుండగా.. కేసీఆర్‌ను ఎంపీ అసదుద్దీన్‌ ప్రశంసించారు. కేసీఆర్‌ను మొండి మనిషి అంటూ ఎంపీ అసదుద్దీన్‌ ప్రశంసించారు.. కేసీఆర్‌ గతంలో కంటే యాక్టివ్‌ అయ్యారన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్‌ యాక్టివ్‌గానే ఉండాలన్నారు.. ఇక, దేశంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను మించిన నాయకుడు మనకు లేరన్నారు ఒవైసీ.. దేశ రాజకీయాలపై కేసీఆర్‌ పిలుపు కోసం వేచి చూస్తున్నాని తెలిపారు.

Read Also: Election Results: 5 రాష్ట్రాల ఫలితాలు ఏపీకి నష్టం.. సీఎం జగన్‌కు మరింత భయం..!

మరోవైపు బుల్డోజర్ సింబల్ తెలంగాణలో ఎట్టిపరిస్థితిలో నడవదంటూ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.. కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయవద్దన్న ఆయన.. దేశంలోనూ రాష్ట్రంలోనూ కేసీఆర్ రాజకీయాలలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు.. రాజకీయాలను కేసీఆర్‌ చాలా ముందుకు తీసుకెళ్తున్నారని వెల్లడించారు. ఇక, తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదని అభిప్రాయపడ్డారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.

Exit mobile version