Site icon NTV Telugu

MP Asaduddin Owaisi: రూల్స్‌కి విరుద్ధం.. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి రెండు చోట్ల ఓటు హక్కు..

Mp Asaduddin Owaisi

Mp Asaduddin Owaisi

MP Asaduddin Owaisi: ఎన్నికల సంఘంపై ఎన్నో విమర్శలు ఉన్నాయి.. ఉన్నవాళ్లకు రెండు, మూడు ఓట్లు ఉంటే.. కొందరినైతే అకారణంగా ఓటర్ లిస్ట్‌ నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. సదరు ఓటరకు తెలియకుండా ఓటర్‌ లిస్ట్‌ నుంచి పేరు మాయమైన సందర్భాలు కూడా అనేకం.. అయితే, అవి సాధారణ ఓటర్లకే పరమితం కాదు.. ప్రముఖులకు కూడా రెండో ఓట్లు కల్పించి వివాదంలో చిక్కుకుంది ఎన్నికల కమిషన్‌.. హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి.. నిన్న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో ఎంపీకి రెండు చోట్ల ఓటు హక్కు కల్పించింది ఎన్నికల కమిషన్‌.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ఓటు ఉంటే.. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో మరో ఓటు కల్పించింది ఎన్నికల కమిషన్… అయితే, అసదుద్దీన్ కు రెండు చోట్లా ఓటు హక్కు కల్పించడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌ పార్టీ..

Read Also: Chennai: చికెన్ ఫ్రైడ్ రైస్ గొడవ.. యజమానిపై వేడినూనె పోసిన తాగుబోతులు

ఒక, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1. రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం EPIC నెం.: KGY0601229, పార్ట్ నం.401, సీరియల్ నంబర్. 906తో ఓటు హక్కు కల్పించింది ఎన్నికల కమిషన్‌.. ఇదే సమయంలో.. 2. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం EPIC నెం.: TDZ1557521, పార్ట్ నం.25, సీరియల్ నెం.412తో మరో ఓటు కల్పించారు.. ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో ఓటర్‌ ఐడీకి ఆధార్‌ నంబర్‌ను జత చేశారు.. ఆధార్‌తో అనుసంధానం చేస్తే.. డూప్లికేట్‌కు అవకాశం ఉండదని చెప్పుకొచ్చారు.. కానీ, ఓ ఎంపీ స్థాయి వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉందంటే.. మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఎవరెవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version