NTV Telugu Site icon

Dharmapuri Arvind: మెజార్టీ స్థానాల్లో గెలుస్తాం.. మా స్ట్రాటజీ మాకుంది

Mp Arvind Kumar

Mp Arvind Kumar

Dharmapuri Arvind: పొంగులేటి కాంగ్రెస్ లో చేరినా.. ఖమ్మం లో మెజార్టీ స్థానాల్లో మేము గెలుస్తామని మా స్ట్రాటజీ మాకు ఉందని బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్ తెలిపారు. ఆర్మూరు మండలం అంకాపూర్ లో మేరా బూత్ సబ్ సే మజ్ బూత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని వీక్షించారు. కాంగ్రెస్ లో భారీ చేరికలు అంటూ జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టి అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పని కట్టుకుని కాంగ్రెస్ కు హైప్ చేయిస్తున్నారని మండిపడ్డారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరినా.. ఖమ్మంలో మెజార్టీ స్థానాల్లో మేము గెలుస్తామని అన్నారు. మా స్ట్రాటజీ మాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. అమిత్ షా కేటీఆర్ తో సమావేశం అయ్యారని రేవంత్ కు ఎవరు చెప్పారు..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా ఒక్కటో కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నామంటూ అసదుద్దీన్ చెప్పడం విడ్డురంగా ఉందని వ్యంగాస్త్రం వేశారు. కారు స్టీరింగ్ ఇప్పటికి ఎం.ఐ.ఎం. చేతిలో ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.

ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలకు ఎలాంటి భ్రమలు పెట్టుకోవద్దని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఫెవికాల్ బంధం. ఇది మీరు అనుకున్నంత కత్తిరించబడదు. ఏం చెప్పినా… అక్కడ ఎవరూ వినరు. ఢిల్లీలో ఎన్ని రౌండ్లు వేసినా సమాధానం దొరకదు. మీ ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్ ఒక్కరే అని రేవంత్ తెలిపిన విషయం తెలిసిందే..
Fighter: పఠాన్ రికార్డులని బద్దలు కొట్టడానికి ఫైటర్ వస్తున్నాడు…

Show comments