NTV Telugu Site icon

Warangal: బిడ్డకు పాలిస్తూ హార్ట్‌ఎటాక్ తో తల్లి మృతి.. మరి బిడ్డ పరిస్థితి..!

Warangal

Warangal

Warangal: ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహమ్మారి నుండి చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో గుండెపోటు ఒకటి. ఈ గుండెపోటు సాధారణంగా కార్డియోవాస్కులర్ సమస్య. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా గుండెపోటుతో బాధపడుతున్నారు. వరంగల్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నెలల బిడ్డకు పాలిస్తూ తల్లి గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పలిన ఘటన అందరికి షాక్ కు గురిచేసింది.

Read also: Minister KTR: ఇక ట్రాఫిక్ జామ్ లుండవు.. స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్‌..

వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత ఈ నెల 13న ప్రసవం కోసం వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 16న ఆమె ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, శిశువుకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలోని నియోనాటల్ కేర్ యూనిట్ (SNCU)లో చేర్చారు. శిశువుకు అక్కడ చికిత్స చేయిస్తుండగా, సుస్మిత సీమాంక్ వార్డులో శిశువుకు పాలిచ్చేది. ఎప్పటిలాగే శుక్రవారం (ఆగస్టు 18) తెల్లవారుజామున 4 గంటలకు ఎస్‌ఎన్‌సీయూలో బిడ్డకు పాలుపట్టింది. ఆ తర్వాత పక్క వార్డులో నిద్రిస్తున్న ఆమెకు ఉదయం 6 గంటలైనా లేవలేదు. కుటుంబ సభ్యులు తట్టిలేపినా సుస్మిత స్పందించలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే సీపీఆర్‌ చేసి బతికేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. తొలి ప్రసవంలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన సుస్మిత.. తల్లి చనిపోవడంతో ఆ రోజంతా పాప తల్లి ప్రేమను కోల్పోయింది. పాలకోసం గుక్కపట్టి ఏడ్చిన తల్లికి వినపించినా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బిడ్డ ఏడుస్తుండటంతో ఓదార్చడం ఎవరి తరం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా కన్నీరుమున్నీరయ్యారు.

Sreeleela: ప్రతి పండగ ఈ పాపదే… నెలకోసారి వస్తుంది