NTV Telugu Site icon

Mother Killed Child: చైన్‌ స్నాచర్‌ చిన్నారి హత్యకేసులో కొత్త ట్విస్ట్‌.. మామూలు కథ కాదిది..!

Mother Killed Child

Mother Killed Child

జనగామ జిల్లా లో చైన్ స్నాచింగ్​కు వచ్చి పాపను నీటిసంపులో పడేసి చంపిన ఘటన కొత్త మలుపు తిరిగింది. ప్రసన్న అనే మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగిలించడానికి ఎవరూ రాలేదని.. తల్లే పాపను హత్య చేసి కట్టుకథ అల్లిందని పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు డీసీపీ సీతారాం వెల్లడించారు. తల్లే ఆ చిన్నారిని నీటి సంపులో పడేసి ఏమీ తెలియనట్లు నాటకం ఆడి పోలీసులకు పెడదారి పట్టించేందుకు చూసిందని, అసలు సూత్రధారి చైన్‌ స్నాచర్‌ కాదు తల్లి తన కన్న కూతురుని హత్య చేసిందని డీసీపీ సీతారాం తేల్చారు.

read also: Bandi Sanjay Padayatra: నేడు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. హాజరు కానున్న కేంద్రమంత్రులు

జనగామ పట్టణమం అంబేడ్కర్ ​నగర్​కు చెందిన నడిగోటు ప్రసన్న, భాస్కర్ దంపతులు నివాసం వుంటున్నారని, వీరి మృతి చెందిన పాపతో సహా మూడేళ్ల బాబు ఉన్నారు. మూడేళ్ల బాబుకు గుండె సంబంధిత జబ్బు రావడంతో కొన్ని రోజుల క్రితమే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారని చెప్పారు. అయితే.. పాప తేజస్వినిలోనూ ఎదుగుదల లేక జీవితాంతం మాటలు రావని వైద్యులు తెలపడంతో తల్లి ప్రసన్న మానసింకంగా కుంగిపోయింది. దీంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి తేజస్వినిని నీటి సంపులో వేసి హతమార్చి, కావాలనే గొలుసు దొంగ చంపాడని కేసును తప్పుదోవ పట్టించింది. పోలీసులు చేపట్టిన విచారణలో భాగంగా తల్లి చేసిన తప్పును ఒప్పుకుంది, నిందితురాలిపై శిశు హత్య 302 కేసు నమోదు చేశామని, తల్లి ప్రసన్న నేరాన్ని చేసినట్టు పోలీసుల ఎదుట ఆమె అంగీకరించిందని డీసీపీ సీతారాం పేర్కొన్నారు.

తల్లి ప్రసన్న అల్లిన పిట్ట కథ

జనగామలో చైన్‌ స్నాచర్లు రేచిపోతున్నారు. రోడ్డుపై వెళ్తున్న మహిళలే టార్గెట్‌ గా వారి మోడలోంచి గొలుసులను లాక్కుని పరారవతున్నారు. ఇలాంటి ఘటనే జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కానీ.. చైన్‌ స్నాచర్‌ దురాగతానికి చిన్నారి బలైంది. అంబేడ్కర్‌ నగర్‌ లోని రోడ్డుపై వెళుతున్న ప్రసన్న అనే మహిళ మెడ నుంచి మంగళసూత్రం దొంగలించేందుకు దుండగడు ప్రయత్నించాడు. దీంతో ఆమె చోరీని అడ్డుకునేందుకు పెనులాటకు దిగింది. ఈ క్రమంలో అతను ఏం ఆలోచించాడో ఏమో గానీ.. మెడలోని చైన్‌ కోసం ఆమె చేతిలోని చిన్నారిని తీసుకుని పక్కనే వున్న నీటి సంపులో పడేసి వెళ్లి పోయాడు. తల్లి ప్రసన్న సంపులో పడిన పాపను రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది, చిన్నారి విగత జీవిగా మిగిలింది. తన మంగళసూత్రం కోసం చూసుకుంటే తన కన్నబిడ్డ తనకు దూరమైపోయిందని గుండెలవిసేలా రోదించింది.

Astrology: ఆగస్టు 2, మంగళవారం దినఫలాలు