NTV Telugu Site icon

Current Shock to Mother and Daughter: పండగపూట విషాదం.. కరెంట్‌ షాక్‌తో ఇద్దరు మృతి

Current Shock

Current Shock

పండగపూట ఆకుటుంబంలో విషాదం నెలకొంది. ఎంతో ఆనందంగా పండగ వాతావరణాన్ని తీర్చి దిద్దేంకు పనుల్లో నిమఘ్నమయ్యారు. పూలతో అలకరిస్తూ.. కల్లాపు చల్లుకుంటూ.. ఇంటిని నీటితో కడుగుతూ.. వినాయక చవితి పండుగను ఘనంగా ఇంట్లో జరుపుకునేందుకు అలకరించే పనిలో పడ్డారు. పాపం వారికి తెలియదు మృత్యువు వారికి పొంచి వుందని, పనిలో నిమగ్నమైన వారికి పక్కనే కరెంట్ తీగ వుందని గమనించలేక పోయింది ఆతల్లి. పని చేసుకుంటూ పక్కనే వున్న విద్యుత్ ఆమె తగలడంతో.. విలవిలలాడుతూ వున్న తల్లిని చూసి చిన్నారి పట్టుకుంది దాంతో చిన్నారికి కూడా కరెంట్ షాక్ కు గురైంది. తల్లి కూతుర్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పండగ సంబురాలు చేసుకోవాల్సిన కుటుంబం వారిద్ది మృతితో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

వివారాల్లోకి వెళితే.. బొప్పారం గ్రామానికి చెందిన సరిత వినాయక చవితి పండుగ సందర్భంగా పనుల్లో నిమగ్నమై ఉండగా విద్యుదాఘాతానికి గురైంది. అయితే.. అక్కడ పక్కనే ఉన్న కుమార్తె ఆడుకుంటూ వుండగా తనకు కూడా కరెంట్ షాక్​తో మరణించింది. తల్లి, కూతుర్లను కాపాడటానికి వచ్చిన తండ్రి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానిక సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రికి తీవ్రంగా గాయపడటంతో.. ఆస్పత్రికి తరలించారు. తండ్రి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వినాయక చవితి పండుగ పూట ఆ కుటుంబంలో నెలకొన్న ప్రమాదంలో బొప్పారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Karnataka: వీరప్పన్ చేతిలో హతమైన తెలుగు ఐఎఫ్ఎస్ అధికారికి ఘన నివాళి..