NTV Telugu Site icon

MosChip: హైదరాబాద్‌ టెక్‌ కంపెనీ ‘మాస్ చిప్’ ప్రత్యేకతేంటి?

Moschip

Moschip

MosChip: హైదరాబాద్‌లోని టెక్నాలజీ కంపెనీ ‘మాస్ చిప్’.. 52 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని నమోదుచేసింది. గత నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. నిరుడు ఇదే టైమ్‌లో ఈ సంస్థ 39 కోట్లకు పైగా మాత్రమే రెవెన్యూని ఆర్జించింది. దీంతో పోల్చితే ఈసారి 33 శాతం అధిక ఆదాయాన్ని సొంతం చేసుకుంది. అయితే.. రెవెన్యూ పెరిగినప్పటికీ నికర లాభం మాత్రం తగ్గిందని మాస్‌ చిప్‌ పేర్కొంది. నెట్‌ ప్రాఫిట్‌.. కోటీ 60 లక్షల రూపాయల నుంచి కోటీ 24 లక్షలకు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలలకు సంబంధించి 95 కోట్ల రూపాయల ఆదాయాన్ని, 2.79 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

CM Jagan: సీఎం జగన్‌తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ.. కారణం ఇదేనా?

ఈ నేపథ్యంలో అసలు ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. 1999లో స్థాపించిన ఈ కంపెనీ.. మొట్టమొదటి ఫ్యాబ్‌లెస్‌ సెమీ కండక్టర్‌ సంస్థ. ఇండియాలో పబ్లిక్‌ ట్రేడింగ్‌లో 20 ఏళ్లకు పైగా అనుభవం దీని సొంతం. సిస్టమ్‌ డిజైన్‌ కంపెనీగా కూడా వ్యవహరిస్తోంది. టర్న్‌కీ ఏఎస్‌ఐసీలు, మిక్స్‌డ్‌ సిగ్నల్‌ ఐపీ, సెమీకండర్‌ అండ్‌ ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆటోమోటివ్‌, మెడికల్‌, నెట్‌వర్కింగ్‌, టెలీకమ్యూనికేషన్స్‌ తదితర రంగాలకు తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

ఈ కంపెనీలో 600 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ట్రస్ట్‌, ట్రాన్స్‌పరెన్సీ, టీమ్‌ వర్క్‌తో ఎంప్లాయీ ఫస్ట్‌ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచటం వల్ల సంస్థకు ఖర్చు పెరిగి లాభాలు తగ్గినట్లు పేర్కొంది. సంక్లిష్టమైన సమస్యలకు సింపుల్‌గా సొల్యూషన్స్‌ చూపెడతామని, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌లో గ్లోబల్‌ లీడర్‌గా గర్వంగా చెప్పుకుంటోంది.