Site icon NTV Telugu

Health Tips : లైట్‌గా తీసుకోకండి.. జాగ్రత్తలు పాటించండి

Rain

Rain

Health Tips : వర్షాకాలంలో జనాలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని చాలా లైట్‌గా తీసుకొని, అవి తీవ్రరూపం దాల్చిన తర్వాత అనేక అవస్థలు పడుతారు. ఈ జలుబు, దగ్గు విషయంలో ముందు నుంచే అప్రమత్తత పాటిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. అసలు ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జలుబు, దగ్గు దరిదాపుల్లోకి రాకుండా ఎలా నివారించాలో పరిశీలిద్దాం.

వర్షకాలంలో గాలిలో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియా చురుగ్గా మారతాయి. వీటి ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్‌ల బారిన మొదటపడేది బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు, ఇప్పటికే పలు రకాల వ్యాధులతో అవస్థలు పడుతున్నవారు. పదేపదే ఇలాంటి వైరల్‌ ఇన్ఫెక్షన్‌ల బారిన పడినప్పుడు శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఈక్రమంలో శరీరం అలసిపోయినట్లు అనిపించి, ఎలాంటి పని చేయాలనిపించదు. జలుబు, జ్వరం తగ్గకుండా ఇలానే కొనసాగితే, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఇది నిద్రపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చికిత్స తీసుకోవడం ముఖ్యం.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!
వర్షాకాలంలో జలుబు, దగ్గు నుంచి రక్షించుకోవడానికి వైద్యులు పలు సూచనలు చేశారు. ముందుగా వర్షంలో తడిసిపోకుండా చూసుకోవాలి, ఒకవేలా తడిచినా వెంటనే దుస్తులు మార్చుకోవాలి లేకుంటే.. వేడి నీటితో స్నానం చేసి పొడి దుస్తులు ధరించాలి. శరీర ఉష్ణోగ్రత పెంచేందుకు పసుపు పాలు, తులసి-అల్లం టీ లేదా కషాయం వంటి పానీయాలు తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే తేలికపాటి, వేడి ఆహారాన్ని తినండి, చల్లని వస్తువులను తీసుకోవడం తగ్గించాలని సూచించారు. సమస్య తీవ్రతరం అయితే వెంటనే వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవడం ముఖ్యం.

Lorry hits scooter: తీవ్ర విషాదం.. స్కూటీని ఢీకొన్న లారీ.. ముగ్గురు విద్యార్థులు మృతి

Exit mobile version