Monkeypox: కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeypox: ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇప్పుడు దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. ఆ వ్యక్తి ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలిసింది. రక్త నమూనాలను పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి వైద్యులు పంపారు. ప్రస్తుతం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు.
కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో, అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వ్యక్తి జులై 6వ తేదీన కువైట్ నుంచి వచ్చారు. 20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి దద్దుర్లు రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లాడు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ్నుంచి 108లో అతన్ని అక్కడి నుంచి తరలిస్తున్నామని… ఇక్కడ సాంపిల్ సేకరించి, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తామని వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. అంతవరకు ఫీవర్ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందజేస్తామని.. ఈ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించామని.. వాళ్లెవరికీ లక్షణాలు లేవని, అయినప్పటికీ వారిని ఐసోలేట్ చేసినట్లు తెలిపింది. ప్రజలు మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ప్రాణాంతక వ్యాధి కాదంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
Monkeypox Cases: ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, కరోనా.. అధికారుల హైఅలర్ట్
ఇదిలా ఉండగా.. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంకీపాక్స్‌పై ఆదివారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన మరునాడే ఈ సమావేశం జరగడం గమనార్హం. ఈ సమావేశంలో మంకీపాక్స్ నివారణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో మరో మహమ్మారి వెలుగుచూస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది.
Monkeypox: మంకీపాక్స్‌పై కేంద్రం అప్రమత్తం.. ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశం
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!