NTV Telugu Site icon

Monaksha Life Sciences : చిన్న నిప్పుతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి

Patancheru Accident

Patancheru Accident

Sangareddy District Patancheru Monaksha life Sciences MD Clarify About Fire Accident over.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని మోనాక్ష లైఫ్‌ సైన్సెన్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాశమైలారంలోని మోనాక్ష లైఫ్ సైన్సెస్ కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్‌ ఫ్యాక్టరీలోని డ్రమ్స్‌ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా ఎన్టీవీతో మోనాక్ష లైఫ్ సైన్సెస్ ఎండీ మాట్లాడుతూ.. లంచ్ సమయంలో రియాక్టర్ల దగ్గర ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ట్ జరిగిందని తెలిపారు. సాల్వెంట్లు ఉండటంతో చిన్న నిప్పుతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని, ఆ సమయంలో 25 మంది కార్మికులు ఉన్నారన్నారు. అగ్నిప్రమాదాన్ని గుర్తించి వెంటనే అందరు బయటికి వచ్చేశారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు.

అన్ని రకాల అనుమతులు మా కంపెనీకి ఉన్నాయని, మొట్ట మొదటిసారి ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని ఆయన తెలిపారు. అనంతరం ఎన్టీవీతో జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందగానే ఐదు ఫైరింజన్లను రంగంలోకి దింపాము. నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చాము. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీయల్ పార్క్ లోని పలు కంపెనీలలో అగ్ని ప్రమాదాలపై తరచూ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామని ఆయన వెల్లడించారు.