NTV Telugu Site icon

Moldy Brownies: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. నలుగురికి మెమోలు జారీ చేసిన ఈఓ..

Bhadrachalam

Bhadrachalam

Moldy Brownies: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం రామాలయంలో బూజుపట్టిన లడ్డూల విక్రయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రుణశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆలయ ఈఓ శివాజీ నలుగురు ఆలయ అధికారులు, సిబ్బందికి మెమోలు జారీ చేశారు. వీరిలో ఆలయ ఏఈవో శ్రవణ్‌కుమార్‌ కూడా ఉన్నారు. ధార్మిక శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో శివాజీ ఈ మెమోలు జారీ చేశారు. ఇటీవల భద్రాచలం రామాలయంలో ప్రసాదం కొనుగోలు చేసిన పలువురు భక్తులు అది బూజు పట్టడంతో షాక్‌కు గురయ్యారు.

Read also: Butcher Son: తల్లిని రోకలిబండతో కొట్టిచంపిన కొడుకు.. అలా చేసేందుకు ప్లాన్‌ వేశాడు

లడ్డూల నాణ్యతను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆయా కౌంటర్లలో లడ్డూలు విక్రయిస్తున్న వారిని ప్రశ్నించారు. అయితే వారి నుంచి వచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని భక్తులు ఇక్కడ బూజుపట్టిన లడ్డూలు విక్రయించబడును అంటూ కౌంటర్లపై కాగితాలు అంటించి నిరసన తెలిపారు. భక్తుల ఫిర్యాదు మేరకు భద్రాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అలాగే జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల కోసం ఆలయ అధికారులు 2 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. కానీ ఆలయంలో జనం అంతగా లేకపోవడంతో లడ్డూలు చాలా వరకు మిగిలిపోయాయి. మిగిలిన లడ్డూలను భద్రపరచడంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తోంది.

Read also: Harish Rao: ప్రముఖులు అంతా RBVRR హాస్టల్లో ఉన్నవారే..!

జనవరి 8న 2023లో భద్రాచలం రామాలయం లో భక్తులకు బూజుపట్టిన లడ్డాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫంగస్ వచ్చిన లడ్డూ అమ్మకంపై భక్తులు మండిపడ్డారు. లడ్డూ కౌంటర్ లో ఫంగస్ వచ్చిన లడ్డాలు విక్రయయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కోటి ఏకాదశి కి లడ్డూ భారీగా మిగిలి ఉండటంతో.. అవే లడ్డూలను వీకెండ్స్ కావడంతో కౌంటర్ లో అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడతున్నారని మండిపడ్డారు. సుమారు 50,000 లడ్డూ కి బూజి , ఫంగస్ సోకిందని, కళ్యాణ లడ్డూ కి కూడా పూర్తిగా ఫంగస్ సోకిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే..
KTR: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి

Show comments