Site icon NTV Telugu

Mahamood Ali: ఎమ్మెల్యే కొడుకు పై కేసు వేరు.. రాజకీయా సంబంధాలు వేరు

Mahmood Li

Mahmood Li

జూబ్లీ హిల్స్‌ మైనర్‌ బాలిక రేప్ కేసుపై తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు.
పబ్ వ్యవహారంలో నా మనువడు ఉన్నాడని కొందరు అనవసర ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అది నిజం కాదని తేలిందని… పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని అన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగిందని…చైర్మన్ తొలగింపు బోర్డు పరిధిలో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ రేప్ వ్యవహారం లో పోలీసులు తమ పని తాము చెనుకుంటు వెళ్తున్నారని స్పష్టం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పై కేసు వేరు రాజకీయా సంబంధాలు వేరు అని గుర్తు పెట్టుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ.

అయితే.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ లో మైన‌ర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో బాధితురాలి వివరాలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారని ఆరోపిస్తూ న్యాయవాది కె. కొమ్మిరెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మధ్యమండలం డీసీపీలకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెక్షన్ 228(ఏ) కింద కేసు నమోదు చేశామని, ఇంతవరకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని సీఐ ప్రసాద్ రావు తెలిపారు.

మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కంచనాగ్ ఠాణాలో కేసు నమోదైంది. అజ్మీర్ దర్గా ఔన్నత్యం. విశ్వాసాన్ని కించపరిచేలా రాజాసింగ్ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేశారని, మతపరమైన అలజడులను సృష్టించేందుకు కుతంత్రాలు చేస్తున్నారంటూ కంచన్బాగ్ ప్రాంత వ్యాపారి మహమూద్ అలీ ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయపరమైన సలహా తీసుకుని కేసు “నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రావు వెల్లడించిన విషయం తెలిసిందే.

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాను లోయలో పడి 18 మంది మృతి

Exit mobile version