NTV Telugu Site icon

Modi Plan Fail : టార్గెట్‌ కాంగ్రెస్‌.. విల్లు విభజన.. మోడీ ప్లాన్‌ రివర్స్‌..?

దేశానికి ప్రధాని స్థానంలో ఉన్న మోడీ.. బీజేపీ రథాన్ని ముందుండి లాగుతున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ ఉంది. అయితే ఈ సమయంలో జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాలు వేదికగా ఉపయోగించుకొని.. మోడీ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేశారు. కానీ.. ఆయన టార్గెట్‌ చేసిన కాంగ్రెస్‌ కు వినియోగించిన విల్లు ‘ఏపీ విభజన’. అయితే కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ.. మోడీ వదిలిన విభజన బాణం వ్యతిరేక పవనాలు వీయడంతో తిరిగి ఆయనకే గుచ్చుకుంది. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన ఏపీ విభజన సరిగ్గా జరగలేదని, ఇప్పటికీ విభజన కారణంగా తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. అదే మా(బీజేపీ) హయాంలో జరిగిన విభజనలు ఎంతో బాగున్నాయని ఆయన చెప్పకనేచెప్పారు. అయితే ఏపీ విభజనపై వ్యాఖ్యానిస్తే.. ఇటు 5 రాష్ట్రాల ఎన్నికల్లో, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్‌పై ఎంతో కొంత విముఖత ఏర్పడి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తుందనేది మోడీ మాస్టర్‌ ప్లాన్‌ అయ్యుండవచ్చు.. కానీ ఆయన వదలిన బాణం సరైన సమయంలో కాకపోయేసరికి తన వేలుతో బీజేపీ నేతల కళ్లు పొడిచిన పరిస్థితి నెలకొంది.

కాంగ్రెస్‌ను టార్గెట్‌ను చేయడం పక్కన పెడితే.. మోడీ వ్యాఖ్యలపై తెలంగాణలో అగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సదవు రానివాడు ప్రధాని అయితే ఇలాగే ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు అంటుంటే.. తెలంగాణపై మోడీ తనకున్న విషం కక్కుతున్నారని.. అందుకే విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చడం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. ఏదేమైనా.. మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ నేతల పీటం కిందకు నీళ్లు తెచ్చేవిధంగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషుల భావన. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్నామని మనోధైర్యంతో ఉన్న బీజేపీ నేతలు గుండెల్లో.. మోడీ వ్యాఖ్యలు గుండుసుదుల్లా.. గుచ్చినట్లే కనిపిస్తోంది. చూడాలి మరి.. మోడీ వ్యాఖ్యల ప్రభావం 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. తెలంగాణలో రాబోయే ఎన్నికలపై ఉంటుందో.. లేదోనని.