హైదరాబాదీలకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటుగా వ్యాక్సినేషన్‌ను వేగంగా వేస్తున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. సోమవారం నుంచి తిరిగి రాష్ట్రంలో పరిస్థితులు సాధారణంగా మారబోతున్నాయి.
Read: 100 శాతం బంగారు తెలంగాణ చేసి తీరుతాం : సిఎం కెసిఆర్
ఈ నేపథ్యంలో నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కలిశారు. ఎంఎంటీఎస్ పునరుద్ధరణపై మాట్లాడారు. రైల్వేశాఖ సానుకూలంగా స్పందించింది. వచ్చేవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి.