Site icon NTV Telugu

MLC Mahender Reddy : : పొరపాటున నోరుజారాను.. విచారిస్తున్నా..

Mlc Mahender Reddy

Mlc Mahender Reddy

వికారాబాద్‌ జిల్లా తాండూరు సీఐ రాజేందర్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బండ బూతులు తిట్టిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి స్పందిస్తూ.. పొరపాటున నోరుజారిన ఆడియో క్లిప్ లతో మనసులు నొప్పించినందుకు విచారిస్తున్నానని ఆయన అన్నారు. నిన్నటి సంఘటనతో ఉన్న ఆడియో క్లిప్పులతో పోలీసుల మనస్సు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని మహేందర్ రెడ్డి అన్నారు.
గురువారం ఆయన ఓ ప్రకటనలో పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానం.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి,అభివృద్ధి, శాంతిభద్రతలలో వారి కృషి అభినందనీయం. నిన్నటి నుండి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లాప్ లు ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారి కొంత మంది మిత్రులు, పోలీసులు బాధపడితే తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవం అని ఆయన చెప్పారు.

Exit mobile version