Site icon NTV Telugu

Ujjaini Maha kali Temple: అమ్మవారికి బంగారు బోనం స‌మ‌ర్పించిన క‌విత‌

Kavitha Kalvakuntla

Kavitha Kalvakuntla

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించారు. కాగా.. మోండా మార్కెట్ డివిజ‌న్‌లోని ఆద‌య్య న‌గ‌ర్ లైబ్ర‌రీ నుంచి 2 వేల మంది మ‌హిళ‌ల‌తో ఎమ్మెల్సీ క‌విత‌ ర్యాలీగా బ‌య‌ల్దేరి అమ్మ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. ఉజ్జ‌యిని అమ్మ‌వారికి అమ్మ‌వారికి క‌విత మొక్కులు చెల్లించుకున్నారు. ఆల‌య అర్చ‌కులు క‌విత‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కవిత మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని మ‌నస్ఫూర్తిగా ఉండాల‌ని అమ్మ‌వారిని కోరుకున్న‌ట్టు ఆమె తెలిపారు.

సికింద్రాబాద్ ఆల‌యానికి 250 ఏండ్ల పైబ‌డి చ‌రిత్ర ఉందని, హైద‌రాబాద్ న‌గ‌రానికి ఉజ్జయిని అమ్మావారి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. విప‌రీతంగా వాన‌లు కురుస్తోన్న నేప‌థ్యంలో వాన‌లు తెరిపివ్వాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆల‌యాల‌ల్లో శాంతి పూజ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. వాన తెరిపి ఇవ్వాల‌ని తాను కూడా ప్రార్థ‌న చేయ‌డం జ‌రిగింది. అమ్మ‌వారి ద‌య వ‌ల్ల ప్ర‌జ‌లంద‌రూ సుర‌క్షితంగా, సుభిక్షంగా ఉండాల‌ని కోరుకుంటున్నానని క‌విత పేర్కొన్నారు. క‌ల్వ‌కుంట్ల క‌విత వెంట మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కుటుంబ స‌భ్యులు.. డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నారు.

ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఇవాళ ఉదయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రారంభ‌మ‌య్యాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి జాతరకు అమ్మవారి దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సికింద్రాబాద్ ఉజ్జ‌యిని అమ్మ‌వారి బోనాల వేడుకలు ఘ‌టోత్స‌వంతో ప్రారంభ‌మ‌య్యాయి. నేడు తెల్లవారుజామునుంచే భక్తులు బోనాలు సమర్పించి, ఉదయం 4 గంటలకి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు జరిపించారు.

Anathapuram Priest: కామ పూజారి.. కళ్లన్నీ మహిళా భక్తులపైనే..!!

Exit mobile version