NTV Telugu Site icon

Kavitha: ప్రధాని మోదీకి 8 ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్లు

Kavita

Kavita

తెలంగాణలో ఇటీవల కాలంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ట్విట్టర్ వేదికగా ఎండగడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ వరసగా ట్వీట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలపై 8 ప్రశ్నాస్త్రాలు సంధించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ ఉంది మోడీ జీ? అంటూ ప్రశ్నించారు. దేశ జీడీపీ పడిపోతుంటే పెరిగిన పెట్రోల్ ధరల డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టారని అడిగారు. తెలంగాణ పట్ల పక్షపాతం ఎప్పుడు అంతం అవుతుంది..? బీజేపీ ప్రభుత్వ రాష్ట్రానికి ఇచ్చే రూ. 7000 కోట్ల బకాయిలను ఎప్పుడు సక్రమంగా అందిస్తారని ప్రశ్నించారు.

ద్రవ్యోల్భనం రికార్డు స్థాయికి చేరుకుంది.. అచ్చే దిన్ ఎప్పుడు చూస్తామని ప్రశ్నించారు. లా అండర్ ఆర్డర్, విఫలమైన వ్యవస్థలు భారత దేశ ప్రజలకు నాన్ – పీఆర్, నిజమైన “అమృత్ కాల్” ఎప్పుడు ఇవ్వబడుతుందిని అడిగారు. రైతులు భారతదేశ గుండె చప్పుడు అని .. కానీ నేడు తెలంగాణలో వరి రైతులు, పసుపు రైతుల కష్టానికి కనీస గుర్తింపును కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారని అన్నారు. దినసరి కూలీలను కొట్టాలనేది మోదీ ప్రభుత్వ న్యూ ఇండియా అని.. ఇక్కడ కోట్టాది మందికి ఉపాధి కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పీఎం కేర్స్ నిజంగా దేశానికి నిజం, నిధుల జవాబుదారీ తనం చెప్పే రోజు వస్తుందా..? అని ప్రశ్నించారు.