MLC Kavitha: మరొక్క సారి రాహుల్ గాంధీ, జీవన్ రెడ్డి ఇలా దిగజారి మాట్లాడొద్దంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిక్వెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కార్యాలయంలో కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ప్రజల అభ్యున్నతికోసం పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఉన్న పథకాలన్నింటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ లో మరణించిన కార్మికుల మృతదేహాలను తొందరగా వారి కుటుంబసభ్యులకు అందించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణాలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. గల్ఫ్ లో ఉన్న సోదరులందరు వాపస్ రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కి మనకు నమ్మక ద్రోహ బంధం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. వందలాది మంది తెలంగాణ బిడ్డలు చావుకు కారణమైది సోనియా గాంధి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కాదు.. అతను ఎలక్షన్ గాంధీ అన్నారు. తెలంగాణ హక్కులపై పార్లమెంట్ లో తల్లి కొడుకులు మాట్లాడలేదని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి గారు.. మీ వయస్సు ఏంది? మీ గౌరవం ఏంది? ఎలక్షన్ల కోసం ఇంత దిగజారి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. బతుకమ్మ పైన ఏదో పెట్టుకొని ఎగురుతారంటరా..? అని మండిపడ్డారు. రాహులు గాంధీ.. మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోవాలని సూచించారు.
బీసీ కులగణనకు కేసీఆర్ వ్యతిరేకం అంటున్నాడు.. మీకు సోయి ఉండే మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. గతంలో కరీంనగర్ లో ఒకటే బీసీ హస్టల్ ఉంటుండే.. ఇప్పుడు నియోజకవర్గానికి 2, 3 ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ వచ్చాకే కార్మికులకు న్యాయం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు తొలగించిన 600 మంది సింగరేణి కార్మికులను ఉద్యోగంలోకి తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అన్నారు.. నిన్న మీటింగ్ లో జీవన్ రెడ్డి గారు.. మీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మూతపడిందని గుర్తు చేశారు. 1933లో నిజాం ప్రభుత్వం వాళ్ళు పెట్టిందే షుగర్ ఫ్యాక్టరీ అని అన్నారు. టీడీపీ వాళ్ళు అమ్మితే చోద్యం చూసింది కాంగ్రెస్ పార్టీ.. కొన్నది బీజేపీ ఎంపి.. 150 కోట్ల లోన్ తీసుకుంటే 66 కోట్లు కట్టింది బీఆర్ఎస్ పార్టీ అని లెక్కలు చెప్పుకొచ్చారు. మీ ఇటలీ రాణి లాంటి దాన్ని కాదు నేనే అంటూ కవిత ఫైర్ అయ్యారు. ఇంత సీనియర్ నాయకుడు ఇలా మాట్లాడిండు ఏంటి అనుకున్నాను కానీ.. ఎన్నికల కోసం ఇంత దిగజారి మాట్లాడుతారా? అని మండిపడ్డారు. రాహులు గాంధీ ఒక పేపర్ టైగర్.. రాహుల్ గాంధీ, జీవన్ రెడ్డి కి నా రిక్వెస్ట్… మరొక్క సారి మీరు ఇలా దిగజారి మాట్లాడొద్దంటూ కవిత అన్నారు.
Mangalavaaram Trailer: ఇదెక్కడి ట్రైలర్ మావా… విజువల్స్ తో గూస్ బంప్స్ తెచ్చావ్